Good News: జనవరి 6న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూ నివర్సిటీ, సెట్విన్,హైదరాబాద్ బలహీన వర్గాల అభి వృద్ధి సంక్షేమ సంఘంతో కలిసి ఎస్‌ఎస్‌సి, ఇంటర్, గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం మెగా ఉర్దూ జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నే షనల్ ఉర్దూ యూనివర్శిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జాబ్ మేళా జరుగుతుంది అని తెలంగా ణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ అభ్యర్థులు, ఎస్‌ఎస్‌సి, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయే షన్‌లో ఉర్దూ మీడియం లేదా ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ కంపెనీలో ఉద్యోగం పొందుటకు అర్హులని, ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు.
చదవండి:
Railway Jobs: నార్తర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Published date : 31 Dec 2021 05:49PM