Mega Job Fair: డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా..
Sakshi Education
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నవంబర్ 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
![November 29 Job Fair at Srikakulam Government Men's Degree College, Mega Job Mela in Srikakulam Degree College, Srikakulam New Colony Job Fair,](/sites/default/files/images/2023/11/28/students-1701154447.jpg)
టి.సి.ఎస్. కంపెనీలో బీపీఓ, డెక్కన్ కెమికల్స్ కంపెనీలో ట్రైనీ (ప్రొడక్షన్), కోజెంట్ ఈ సర్వీసెస్ కంపెనీలో బీపీఒ, నిట్ ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్, ఇసుజు మోటార్స్, సియాన్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
టెన్త్ నుంచి బి.టెక్ వరకు చదివిన 35 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 9 గంటలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9949094968 నంబరును సంప్రదించాలని జేకేసీ కోఆర్డినేటర్ వైమణికుమార్ తెలిపారు.
Published date : 28 Nov 2023 12:24PM