Mega Job Mela: 22న మెగా జాబ్ మేళా
స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో జూలై 22న చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న జాబ్‌మేళా పోస్టర్‌ను జూలై 19న ఆమె ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏకంగా 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందన్నారు.
చదవండి: 250 posts in Vizag Steel Plant: ఈ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు .. ఎంపిక విధానం ఇలా..
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. జూలై 22న మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్, మాస్టర్ మైండ్స్, ఎపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్, హెటిరో డ్రగ్స్, అపోలో ఫార్మసీ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు వివరించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
చదవండి: Job Mela for Unemployed Youth: ఎలా అప్లై చేసుకోవాలి... ఉద్యోగ వివరాల కోసం ఇక్కడ చూడండి!