Mega Job Mela: ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా
వాల్‌మార్ట్, బిగ్ సీ మొబైల్స్, మెడ్ ప్లస్, బిగ్ బాస్కెట్, టీం లీజ్, యూనియన్ బ్యాంక్, మహాదేవ్ షిప్పింగ్, శ్రీరామ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో 685 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. ఫ్లోర్ అసోసియేట్, వ్యాన్ డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్, అసెంబ్లీ ఆపరేటింగ్ కాల్ అసిస్టెంట్, ఆపరేటర్, కస్టమర్ ఎగ్జిక్యూటివ్, కెమిస్ట్, క్యాషియర్, పిక్కర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, వేర్‌హౌస్ అసోసియేట్స్, టీం లీడర్స్, అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆయా ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, ఐటీఐ, బీటెక్, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన 18–35 ఏళ్ల వయసు కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు https://www.ncs.gov.in/ లో పేర్లు నమోదు చేసుకుని సెప్టెంబర్ 22న జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.
చదవండి:
SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..