Skip to main content

Job Fair: వికాసలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూల తేదీ ఇదే

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఏప్రిల్ 17న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.లచ్చారావు ఏప్రిల్ 14న‌ సాయంత్రం తెలిపారు.
Job Fair
వికాసలో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూల తేదీ ఇదే

ఈ జాబ్‌మేళాలో ఫెడరల్‌ బ్యాంక్‌లో ఏజెన్సీ లీడ్‌ మేనేజర్‌, ఏజన్సీ లీడర్‌, కోజెంట్‌ ఈ–సర్వీసెస్‌లో బీపీఓ, నిట్‌ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, డి మార్ట్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, క్యాషియర్‌, డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీలో ట్రైనీ మేనేజర్‌, హుండాయ్‌ మోబీస్‌లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ లచ్చారావు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.10 వేలు నుంచి రూ. 25 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 17న కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ఉదయం 9 గంటలకు హాజరుకావచ్చన్నారు.

చదవండి:

‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

Published date : 15 Apr 2023 04:56PM

Photo Stories