Job Fair: పాలిటెక్నికల్ కళాశాలలో జాబ్ మేళా
Sakshi Education
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జూలై 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వారికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారన్నారు.
ఇంటర్మీడియెట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చదవండి:
PJTSAU: మరో కోత్త వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ.. డాక్టర్ అవినాశ్ వనం పేరిట బంగారు పతకం
Polytechnic Scholarships: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.50 వేలు!
Published date : 08 Feb 2024 12:21PM