PJTSAU: మరో కోత్త వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ.. డాక్టర్ అవినాశ్ వనం పేరిట బంగారు పతకం
ఈ మేరకు జూలై 25న ఆన్‌లైన్‌లో వ్యవ సాయశాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ రఘునందన్‌రావు అధ్యక్షతన అకడ మిక్ కౌన్సిల్ సమావేశం జరిగింది. డిప్లొమా, యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వ్యవసాయ మంత్రిత్వశాఖలోని ఆయిల్ సీడ్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అవినాశ్ వనం తనపేరిట బంగారు పతకం అందించాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని కౌన్సిల్ ఆమోదించింది.
ఈ బంగారు పతకం కోసం డాక్టర్ అవినాశ్ వనం రూ.4 లక్షల సాయం అందించనున్నారు. ఈ డబ్బుపై వచ్చే వడ్డీతో వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ(ఆన ర్స్) అగ్రికల్చర్ కోర్సులో అత్యధిక ఓవరాల్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థికి ప్రతిఏటా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం రోజున బంగారు పతకాన్ని అందచేస్తారు.
చదవండి: Biotechnology : ఏజీ వర్సిటీలో జీవసాంకేతిక ఉపకరణాలపై శిక్షణ