Skip to main content

Biotechnology : ఏజీ వర్సిటీలో జీవసాంకేతిక ఉపకరణాలపై శిక్షణ

Training Programmes In Biotechnology
Training Programmes In Biotechnology

ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  సోమవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ‘క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌లో జీవసాంకేతిక ఉపకరణాలు’ అంశంపై   శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి సహకారంతో కొనసాగనుంది. ఈ సందర్భంగా వర్సిటీ పరిశోధన సంచాలకులు  డాక్టర్‌ జగదీశ్వర్, భారతీయ వరి పరిశోధన సంస్థ మాజీ సంచాలకులు డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌  పరిశోధన అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలపై వివరించారు. ఈ శిక్షణ రెండు వారాల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో సంస్థ సంచాలకులు డార్టర్‌ దుర్గారాణి, డాక్టర్‌ వాణిశ్రీ, డాక్టర్‌ సీహెచ్‌ అనురాధ, డాక్టర్‌ పుష్పవల్లి 
తదితరులు పాల్గొన్నారు. 
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 15 Mar 2022 04:12PM

Photo Stories