Skip to main content

Job Mela: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

Tekkali Government Degree College Job Fair  Career Opportunities at Tekkali Job Mela  Job Mela   Job Mela at Tekkali Government Degree College  JKC and Career Guidance Cell Job Fair

టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న జేకేసీ అండ్‌ కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి. గోవిందమ్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌, విశాఖపట్టణానికి చెందిన అరబిందో, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ కంపెనీలు ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Supreme Court NEET Hearing Plea Live Updates: నీట్‌ పరీక్ష రద్దు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన పురుష అభ్యర్థులకు అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు, ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన 17 నుంచి 19 ఏళ్లు వయసు కలిగిన అభ్యర్థులకు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 7013365031, 9640628406 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ గోవిందమ్మ ప్రకటించారు. 

 

Published date : 08 Jul 2024 12:42PM

Photo Stories