Job Mela : జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే!

కాకినాడ సిటీ: కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దక్కెన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 200 మంది ట్రైనీ కెమిస్ట్ ఉద్యోగాల కోసం బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమో ఇన్ కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసిన 18–27 ఏళ్ల పురుష అభ్యర్థులు కావాలన్నారు. వీరు తునిలో పని చేయాలన్నారు. వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 48 టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, పెయింటర్, డెంటర్, సీనియర్ డెండర్, సీనియర్ పెయింటర్స్, సెల్స్ ఎగ్జిక్యూటివ్ అడ్వయిజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Free Grand Tests: Group 2 ఉచిత గ్రాండ్ టెస్ట్‌లు
ఈ పోస్టులకు ఐటీఐ డీజిల్ మెకానికల్ లేదా డిప్లొమో అన్ని ట్రేడులు, బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఆటోమొబైల్‌లో రెండేళ్లు నైపుణ్యం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. కాకినాడ, పెద్దాపురం పట్టణాల్లో పని చేయాలన్నారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 200 మంది అభ్యర్థులు కావాలని, ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ వరకూ చదువుకున్న 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.
Md Farzan Mohammad: జేఎల్ ఫలితాల్లో ఫర్జానాకు 23వ ర్యాంక్
వీరు కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఎస్‌కేఎల్ అసోసియేట్స్‌లో టెలీకాలింగ్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేందుకు 60 మంది 18–35 ఏళ్ల లోపు అభ్యర్థులు కావాలన్నారు. వీరు కాకినాడ, చోడవరం, విశాఖపట్నం, హైదరాబాదుల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు.
Tags
- Job mela
- Unemployed Youth
- District Employment Office
- registration
- July 10
- trainee chemist jobs
- graduated students
- jobs for mens
- latest job news
- Education News
- Job Fair
- Kakinada City
- employment opportunities
- Career Fair
- Eligible Candidates
- recruitment event 2024
- Job Openings
- latest jobs in 2024
- sakshieducationlatest job applications