Skip to main content

Job Fair: 27న ఉద్యోగ మేళా.. పూర్తి వివరాల కోసం సంప్రదించండి

చీపురుపల్లి: పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగులకు డిసెంబ‌ర్ 27న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పీవీ కృష్ణాజీ డిసెంబ‌ర్ 24న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
"Opportunity for the unemployed: Job fair in Chipurupalli  Employment opportunity  Job fair on 27th    Government Adarsh Degree College to host job fair on December 27

డిసెంబ‌ర్ 27న ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌ మేళాకు హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎస్‌ ల్యాబ్స్‌, న్యూ ల్యాండ్‌ ల్యాబొరేటరీస్‌ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.

చదవండి: SSC Constable Notification 2023: 7,547 కానిస్టేబుల్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... జాబ్ కొట్టండి

ఈ ఉద్యోగమేళాకు హాజరు కాదలచిన అభ్యర్థులు బీఫార్మా, బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్‌, ఇంటర్‌మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత కలిగి కనీసం 26 సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆర్‌బీఎస్‌ఎస్‌ అండ్‌ ఎఫ్‌ఎన్‌దాస్‌ పరిశ్రమ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా విశాఖపట్నంలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఉద్యోగావకాశాల్లో భాగంగా నెలకు రూ.12,500 నుంచి రూ.20,000 వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 8688156216, 86880880562 నంబర్లకు సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Published date : 25 Dec 2023 06:00PM

Photo Stories