Skip to main content

Job Mela: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్‌ మేళా

నల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఫిబ్ర‌వ‌రి 23న ఉదయం 10 గంటలకు మిర్యాలగూడ రోడ్డు ఐటీఐ భవన్‌లో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్‌.పద్మ ఫిబ్ర‌వ‌రి 21న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Job fair on 23rd   Nalgonda Job Fair  Opportunity for Job Seekers in Nalgonda District

ఎంఎస్‌ఎన్‌ లేబోరేటరీస్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు, అవేజ్‌ లిమిటెడ్‌, అపోలో హోం హెల్త్‌కేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం అర్హత గల అభ్యర్థులు నేరుగా వారి ఒరిజినల్స్‌ సర్టిఫికెట్స్‌, జిరాక్స్‌లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.

చదవండి: Job Mela: టీవీఎస్‌ ట్రైనింగ్‌, సర్వీసెస్‌ కంపెనీలో రేపు జాబ్‌మేళా

ఎంపికై న అభ్యర్థులకు ఆయా కంపెనీల్లో అర్హత, నైపుణ్యాలను బట్టి నెలకు రూ.11 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న నిరుద్యోగులు పూర్తి వివరాల కోసం 9951720856 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Published date : 22 Feb 2024 04:51PM

Photo Stories