IT Job Mela: ఐటీ జాబ్..యువత క్రేజ్
ఈ మేళాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగ రాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో ఐటీ హబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగాలంటే బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే కాకుండా జిల్లాల్లోనూ ఉండేలా చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: T Hub 2.0: ‘టీ–హబ్’ అంటే ఏమిటి..? దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?
గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉండేలా వేగంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌కు విదేశీ కంపెనీలు వచ్చేలా కృషి చేసిన మహేశ్ బిగాలకు అభినందనలు తెలిపారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాదు, ఉద్యోగాలు సృష్టించేందుకు మరిన్ని బాటలు వేసినట్లన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ మహేశ్ బిగాల, నుడా చైర్మన్ ప్రభాకర్ రె డ్డి, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టీఎస్‌డబ్ల్యూడీసీ చైర్‌పర్సన్ ఆకుల లలిత, మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, టాస్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: IT Hubs: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లు
నగరంలో 50 వేల చదరపు అడుగులు, రూ. 40 కోట్ల పెట్టుబడితో ఈ హబ్‌ను ఏర్పాటు చేరు. మొదటి విడతలో 745 సీట్లు కల్పించారు. మరో 1000 మందికి ఇతర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలో రెండో దశ ఐటీ హబ్ ప్రారంభిస్తామని, ఇండస్ట్రియల్ పార్క్, ఆటో పార్క్ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పేర్కొన్నా రు. మొ దటి జాబ్‌మేళాలోనే 10 వేల రిజిస్ట్రేష న్లు రావడం గొప్పవిషయమన్నారు.
చదవండి: కొత్త ఐటీ పాలసీతో రానున్న మూడేళ్లలో 55,000 ఉద్యోగాలు