IIIT: సాఫ్ట్‌వేర్ కొలువుల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సత్తా
ఇడుపులపాయ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న సీఎస్‌ఈ విద్యార్థి సాదు మునిచిత్ర అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైంది. ఈమెకు నెలకు రూ.1.10 లక్షల స్టైఫండ్‌ను కంపెనీ ఇవ్వనున్నట్లు ఇడుపులపాయ డైరెక్టర్ ఆచార్య కె.సంధ్యారాణి తెలిపారు. ఈ విద్యారి్థని స్వగ్రామం తిరుపతి జిల్లా నారాయణవనం. తండ్రి మునిబాబు రోజువారీ మగ్గం కూలీగా పని చేస్తుండగా.. తల్లి శంకరమ్మ గృహిణి.
చదవండి: IIIT Hyderabad: వైఫై బదులు వై–సన్..
నెలకు రూ.40 వేల స్టైఫండ్‌తో 22 మంది
కాగా, ఇడుపులపాయ క్యాంపస్‌కు చెందిన మరో 22 మంది విద్యార్థులు నెలకు రూ.40 వేల స్టైఫండ్‌తో పలు కంపెనీలకు ఎంపికయ్యారు. ఇంటెల్ కంపెనీ 11 మంది విద్యార్థులను, సినాప్సిస్ కంపెనీ ఏడుగురు విద్యార్థులను, థాట్ వర్క్స్ కంపెనీ నలుగురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. ఆయా విద్యార్థులను ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి, వైస్ చాన్సలర్ కె.హేమచంద్రారెడ్డి, డైరెక్టర్ కె.సంధ్యారాణి అభినందించారు.
చదవండి: IIIT UNA: పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ