IIIT UNA: పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం.
Also read: Telangana History Bitbank in Telugu: నేలకొండపల్లి శాసనాన్ని వేయించింది ఎవరు?
3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP