IIIT Hyderabad: వైఫై బదులు వై–సన్..
Sakshi Education
రాయదుర్గం: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ క్యాంపస్ మరింత సాంకేతికతను సమకూర్చుకుంది.
సిలికాన్ ల్యాబ్స్ అనే సంస్థతో కలసి క్యాంపస్‌వ్యాప్తంగా వైఫైకన్నా మెరుగ్గా పనిచేసే వైర్‌లెస్ స్మార్ట్ యుటిలిటీ నెట్‌వర్క్ (వై–సన్)ను తాజాగా ఏర్పాటు చేసుకుంది. స్మార్ట్ నగరాలు, ఇంటర్నెట్ ఆధారిత సేవలపై సాగిస్తున్న విస్తృత ప్రయోగాల్లో భాగంగా క్యాంపస్‌లోని స్మార్ట్‌సిటీ లివింగ్ ల్యాబ్‌ను వై–సన్ ద్వారా అనుసంధానించింది. ఈ తరహా సాంకేతికతను వినియోగించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. వైఫైకన్నా తక్కువ వేగంతోనే వై–సన్ ద్వారా సమాచార మార్పిడి జరిగినా దీని పరిధి, నిరంతర అనుసంధానత వైఫైకన్నా ఎక్కువే కావడం ఇందులోని ప్రత్యేకత.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 14th కరెంట్ అఫైర్స్
Published date : 15 Oct 2022 03:22PM