Jobs: ఏపీ వర్సిటీల్లో ఖాళీల భర్తీ
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 18 యూనివర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్ పోస్టులతో కలిపి) పోస్టుల నియామకాలను చేపడుతోంది.
ఉన్నత విద్యా మండలి ‘ఉమ్మడి పోర్టల్’ ద్వారా మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో అయితే ప్రతి వర్సిటీకి ఒక్కో దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చేది. వీటికే అభ్యర్థులు రూ.వేలు చెల్లించాల్సి వచ్చేది. భవిష్యత్ తరాలకు సైతం యూనివర్సిటీల్లో అత్యుత్తమ బోధన సామర్థ్యాలు అందించేందుకు వీలుగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనుంది.
చదవండి: Tattoo banned for Govt Jobs: టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
దరఖాస్తు రుసుము ఇలా..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్ బెంచ్ మార్క్ విత్ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో టెస్ట్‌లు రా>యాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి.
ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అభ్యర్థుల దరఖాస్తు కోసం జ్టి్టp:// ట్ఛఛిటuజ్టీఝ్ఛn్టట. unజీఠ్ఛిటటజ్టీజ్ఛీట. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచింది. వర్సిటీల వారీగా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు పరిశీలన అనంతరం వెల్లడించనుంది.
దరఖాస్తులకు గడువు ఇలా..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023
పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు: 27.11.2023
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023
అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023
10 మార్కులు వెయిటేజీ ఇలా..
విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే.. కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఎక్కువ మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కింద పని చేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రావట్లేదు. ఫలితంగా వారి విధులకు ఎటువంటి ఆటకం ఉండదు. మిగిలిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే వారి అనుభవాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
బాబు భర్తీ చేసింది ‘సున్నా’
చంద్రబాబు అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు.. రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోయాయి. గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల తీర్మానంతో పోస్టుల భర్తీ చేపట్టినా నోటిఫికేషన్ ప్రక్రియ గందరగోళాన్ని సృష్టించింది. రోస్టర్ విధానం, హేతుబద్ధీకరణ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో తమకు నష్టం జరుగుతోందంటూ అనేక మంది అభ్యర్థులు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
కనీసం కోర్టు కేసులను కూడా పరిష్కరించాలనే ఆలోచన కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. ఇక్కడ యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా.. వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్నిచోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. యూనివర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టుల వారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలామంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు.
బోధనేతర పోస్టులకూ ప్రాధాన్యం
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ యుద్ధప్రాతిపదికన పెద్దఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. యూనివర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. యూనివర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. ఫలితంగా మొత్తం 18 యూనివర్సిటీల్లో 4,330 పోస్టులొచ్చాయి.
వీటిల్లో ఇప్పటికే పని చేస్తున్న అధ్యాపకులు కాకుండా తాజాగా 3,200 మందిని నియమిస్తోంది. ఇక బోధన పోస్టులతోపాటు ప్రతి యూనివర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులను తప్పనిసరి చేసింది.