ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 12న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
అధ్యాపక రాత పరీక్ష, ఇంటర్వ్యూల తేదీలు
యూనివర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీలకు పార్ట్‌టైం అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12న దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలని అధికారులు ఫిబ్రవరి 7న తెలిపారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 14న ఇంటర్వూ్లను నిర్వహిస్తామని వెల్లడించారు.