Tenth and Inter: పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం
Sakshi Education
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కచ్చితంగా టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
కోవిడ్ కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తామన్నారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తామని చెప్పారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని, అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని, ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని అన్నారు.
చదవండి:
Intermediate: ఇంటర్‌లో డిజిటల్ మూల్యాంకనం
TSBIE: ఆ అధికారాలు ఇంటర్ విద్య కమిషనర్ పరిధిలోకి
Intermediate: పాస్ సర్టిఫికెట్ల డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఇదే..
Published date : 08 Feb 2022 10:18PM