TSBIE: ఆ అధికారాలు ఇంటర్ విద్య కమిషనర్ పరిధిలోకి
ఈమేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సయ్యద్ ఒమర్‌జలీల్ జనవరి27న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇక మీదట వరంగల్ ప్రాంతీయ కార్యాలయానికి అధికారాలు తగ్గుతాయి. రాష్ట్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉద్యోగులు, పెన్షనర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, కారుణ్య నియామకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వరంగల్ ఆర్‌జేడీ పరిధిలో ఉండేవి. ఇకనుంచి ఈ బాధ్యతలన్నీ హైదరాబాద్‌లోని ఇంటర్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొంతమంది సిబ్బంది ద్వారా కొనసాగనున్నాయి. కాగా, ఈ నిర్ణయంపై తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ స్పందిస్తూ ‘అధికార కేంద్రీకరణ వల్ల ఇంటర్ విద్య పరిధిలోని ఉద్యోగులు నష్టపోతారు. ప్రతీ పని కోసం హైదరాబాద్‌లోని కార్యాలయానికి రావాల్సి వస్తుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చాలి’అని తెలిపారు.
చదవండి:
Intermediate: పాస్ సర్టిఫికెట్ల డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఇదే..
Intermediate: టీ–శాట్ ద్వారా ఇంటర్ సిలబస్.. షెడ్యూల్డ్ ఇలా...