Skip to main content

Inter Exams Preparations : క‌ష్టేఫ‌లి సూత్రాన్ని విద్యార్థుల‌కు విచారిస్తున్న అధికారులు.. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా!

ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.
AP inter exams preparation planning for students

మదనపల్లె సిటీ: ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు. కష్టేఫలి సూత్రాన్ని విద్యార్థులకు వివరించడంతో పాటు ఆచరణలో పెడుతున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. గడువు సమయాన్ని పెంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 15,462 ద్వితీయ సంవత్సరంలో 14,721 మంది విద్యార్థులు ఉన్నారు.

Inter Exam Fees : ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల ఫీజుకు గ‌డువు పెంపు.. ఈ తేదీలోగా..

ఉదయం 9 గంటల నుంచి..

ఇంటర్మీడియట్‌ కాలేజీలలో గతంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు తరగతులు ఉండేవి. ప్రస్తుతం 9 గంటల నుంచి 5 వరకు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలతో పాటు గిరిజన సంక్షేమ గురుకుల, కేజీబీవీలు, ప్లస్‌టూ, వృత్తి విద్య కళాశాలల్లో విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రోజూ సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఉత్త మ ఫలితాలు సాధించాలని అధ్యాపకులు తర్ఫీదు ఇస్తున్నారు. వెనుకబడిన వారు మెరుగైన ఫలితాలు తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

పరీక్ష పత్రాలు ఆన్‌లైన్‌ ద్వారా..

ఇంటర్మీడియట్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్‌, ఒకే ప్రశ్నపత్నం అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నపత్రాలను పరీక్షకు గంట మందు ఉంచితే వాటిని కళాశాల ప్రిన్సిపాళ్లు డౌన్‌లోడ్‌ చేసు కుని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. దీని వల్ల మాస్‌ కాపీయింగ్‌కు తావుండదంటున్నారు. ప్రస్తుతానికి క్వార్టర్లీ పరీక్షలు పూర్తయి.. వాటి మార్కులను ఇంటర్‌బోర్డు పంపించారు. మూ డో యూనిట్‌ టెస్టు పరీక్షలు కూడా పూర్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తారు. పిల్లల విద్యాప్రగతిని వివరిస్తారు.

School Holidays: ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్‌!.. కార‌ణం ఇదే..

ప్రోగ్రెస్‌ కార్డులు అందజేత

ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు లేత పసుపు రంగు,ద్వితీయ సంవత్సరం వారికి నీలం రంగు, వృత్తి విద్య కోర్సుల వారికి తెలుపు రంగు ప్రోగ్రెస్‌ కార్డులను ముద్రించి ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచే అన్ని కాలేజీల్లో విద్యార్థులకు పరీక్షల్లో సాధిస్తున్న మార్కులు, హాజరు, అంతర్గత పరీక్షల మార్కులు, అన్నింటినీ కార్డుల్లో పొందుపరచనున్నారు. పరీక్షలు పూర్తయిన అయిదు రోజుల్లోగా విద్యార్థుల ఫలితాలను ప్రోగ్రెస్‌ కార్డుల్లో నమోదు చేయడంతో పాటు ఇంటర్మీడియట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ

ఉత్తమ ఫలితాల సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నాం. విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడుతున్నాడో గుర్తించి బోధన ఉంటుంది. అధ్యాపకులు అదనపు తరగతులు నిర్వహణ బాధ్యతను చేపట్టారు. విద్యార్థుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. గడువు సమయాన్ని పెంచినా.. దూరప్రాంతాల విద్యార్థులకు ముందుగానే పంపిస్తున్నాం.

–బాలకృష్ణమూర్తి, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీ,మదనపల్లె

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Nov 2024 01:21PM

Photo Stories