Free Training: నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి అక్టోబర్ 14న ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానం, సౌకర్యాలతో హౌస్ వైరింగ్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ పరికరాల రిపేర్లు, మోటార్ రివైండింగ్‌పై 45 రోజుల పాటు శిక్షణ ఉంటుంది.
చదవండి: Free Training: స్వయం ఉపాధితోనే భవిత పదిలం
వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు కస్టమర్లతో వ్యవహరించడం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు, 5వ తరగతి వరకూ చదువుకున్న వారు అర్హులు. శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ అందజేస్తారు. అలాగే ఆసక్తి ఉన్న వారికి వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ కల్పిస్తారు. పూర్తి వివరాలకు 85000 74757, 77807 52418లో సంప్రదించవచ్చు.