Skip to main content

వెద్య, ఆరోగ్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీ ఉంచవద్దు

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా డీఎంహెచ్‌వోలు, రీజినల్‌ డైరెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ డాక్టర్‌ రామిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Do not leave a single post vacant in the Medical and Health Department
వెద్య, ఆరోగ్య శాఖలో ఒక్క పోస్టు ఖాళీ ఉంచవద్దు

జిల్లా, జోన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి నోటిఫికేషన్‌లు జారీ చేసి భర్తీ చేపట్టడానికి పరిపాలన అనుమతులిచ్చారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతులు తీసుకునే పనిలేకుండా తమ స్థాయిలోనే పోస్టులను నోటిఫై చేసుకోవాలన్నారు.

చదవండి: Family Doctor: మరింత సమర్థంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మానవ వనరులు ఉండటం కీలకమని చెప్పారు. ఈ క్రమంలో ఏదైనా ఆస్పత్రిలో క్యాడర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లైతే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చదవండి: డాక్టర్‌ రోబోకు పేటెంట్‌ ప్రయత్నం

Published date : 27 Apr 2023 04:18PM

Photo Stories