25,000 Jobs: కడప స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు.
- 8,800 కోట్ల పెట్టుబడి
- 25,000 మందికి ఉపాధి, ఉద్యోగాలు
కడప గడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంకల్పించారు. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని భావించారు.
చదవండి: Jagananna Gorumudda : జగనన్న గోరుముద్ద మెనూలో..‘రాగిజావ’
తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ సిద్ధమైంది. అందుకోసం ఫేజ్–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్ రాడ్స్, బార్ మిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
చదవండి: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో లక్షకు పైగా జాబ్స్