బనశంకరి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు బెంగళూరు దక్షిణ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
అరెహళ్లి ఏజీఎస్. లేఔట్‌లోని ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 13న ఐదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 1500 మందికి శ్రీకృష్ణ విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎం.రుక్మాంగదనాయుడుతో కలిసి బ్యాగులు, పుస్తకాలు అందజేశారు.
చదవండి: Students Knowledge: సొంత గ్రామాల చరిత్రను పుస్తకాల్లోకి రచించిన విద్యార్థులు
అనంతరం ఎం.రుక్మాంగదనాయుడు మాట్లాడుతూ అరెహళ్లి, కత్రిగుప్పె, కదిరేనహళ్లి, చెన్నసంద్ర, బంగారప్పనగరలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ ప్రసన్నకుమార్, శ్రీకృష్ణ విద్యాసంస్థ డైరెక్టర్ ఎస్‌పీ.మనోహర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.ఉషాకుమారి, ప్రొఫెసర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.