Students Knowledge: సొంత గ్రామాల చరిత్రను పుస్తకాల్లోకి రచించిన విద్యార్థులు
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టిన ‘మన వూరు – మన చరిత్ర’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలోని రెండు వేల గ్రామాల చరిత్ర నమోదైందని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు, జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 568మంది తమ గ్రామాల చరిత్రను పుస్తకాల రూపంలో సిద్ధం చేయగా... ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా మంగళవారం చైర్మన్ గౌరీశంకర్, కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌కు అందజేశారు.
District wide ఫార్మెటివ్, సీబీఏ– 1 పరీక్షలు ప్రారంభం
ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఏడాది క్రితం డిగ్రీ విద్యార్థులతో వారి స్వగ్రామాల చరిత్ర రాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల సహకారంతో ఇప్పటివరకు రెండు వేల గ్రామాల చరిత్ర సిద్ధమైందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తమ గ్రామాల ప్రత్యేకతలపై అవగాహన పెరగడమే కాక వారిలోని సృజనాత్మక శక్తి వెలికితీసినట్లవుతుందని తెలిపారు. ప్రతీ గ్రామ చరిత్ర, ప్రత్యేకతలే కాక తెలంగాణ రాక ముందు, వచ్చాక జరిగిన అభివృద్ధిని పుస్తకాల రూపంలో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఊరి చరిత్రను రాసిన వారిని గ్రామస్తులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.
Medical College: జనగామ మెడికల్ కళాశాలలో 63 మంది చేరిక
విద్యార్థులు రాసిన చరిత్రే భవిష్యత్ తరాలకు గెజిట్‌గా మారుతుందని చెప్పారు. సాహిత్య అకాడమీ చేపట్టిన ఈ కార్యక్రమానికి అండగా నిలవడమే కాకుండా విద్యార్థులు రాసిన పుస్తకాలను వెలుగులోకి తేవడానికి సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బీ.వీ.రెడ్డి, టి.జీవన్‌కుమార్, అధ్యాపకులు డాక్టర్ సీతారాం, మిల్టన్, జె.రమేష్, డాక్టర్ సర్వేశ్వరరావు, డాక్టర్ వరలక్ష్మి, అత్తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.