Medical College: జనగామ మెడికల్ కళాశాలలో 63 మంది చేరిక
జనగామ: జనగామ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో 63 మంది విద్యార్థులు రిపోర్టు చేశారు. ఇందుకు సంబంధించి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్‌రావు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. స్టేట్ కోటాకు సంబంధించి మొదటి విడతలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా, సెంట్రల్ కోటాలో నేటి(సోమవారం)తో ముగియనుంది. ఇందులో సెంట్రల్ కోటాలో 14 సీట్లు ఉండగా.. కేవలం ఏడుగురు మాత్రమే జాయిన్ కాగా, 86 స్టేట్ కోటా సీట్లలో 56 మంది రిపోర్టు చేశారు. ఇంకా 37 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేట్ కోటాలో విద్యార్థులకు మరింత అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూస్తున్నామని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు తెలిపారు. విద్యార్థులకు ఆయన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఆయన వెంట డాక్టర్లు శంకర్, అన్వర్ తదితరులు ఉన్నారు.
చదవండి: Health Awareness: గురుకుల బాలిక విద్యార్థులకు ఆరోగ్యశాఖ అందించిన అవగాహన