Health Awareness: గురుకుల బాలిక విద్యార్థులకు ఆరోగ్యశాఖ అందించిన అవగాహన
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీహెచ్‌వో రామ్మూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్ కీటక జనిత వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం గురించి వివరించారు. ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఏడిస్ దోమల వల్ల మలేరియా, బోదకాలు, మెదడు వాపు, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
Andhra Pradesh Jobs: AP స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 800+ ఉద్యోగాలు!
నిల్వ నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయని, ఇళ్లలోని నీటి డ్రమ్ములు, తొట్టిలలో కనిపించే తోక పురుగులే దోమ లార్వాలు అని వివరించారు. గుడ్డు దశ నుంచి దోమగా వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుందని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. ఇదే కార్యక్రమాన్ని పోస్ట్‌మెట్రిక్ బాలుర హాస్టల్, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. అల్ఫాసైఫర్ మెత్రిన్ అనే దోమల మందును పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సుజాత, స్టాఫ్‌నర్సు రమాదేవి, మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ దమయంతి, వసతి గృహ సంక్షేమ అధికారి లక్ష్మణ్, హెల్త్ అసిస్టెంట్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.