Skip to main content

Udise Plus: బడి ప్రగతికి బాటలు.. ప్రభుత్వ, ప్రైవే టు విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమాచారం ఒకేచోట నమోదు

నిర్మల్‌ఖిల్లా/మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవే టు విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమగ్ర సమాచా రం ఒకేచోట నమోదుకు కేంద్ర ప్రభుత్వం యూడైస్‌ ప్లస్‌(ఇన్ఫర్మెషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) పోర్టల్‌ తీసుకొచ్చింది.
Schools are the future development of students

విద్యాశాఖ అందించే సమగ్ర వివరాల ఆధారంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని వి ద్యార్థులు, బోధకుల వివరాలన్నీ నమోదు చేసే ప్ర క్రియ కొనసాగుతోంది. సెప్టెంబ‌ర్ 25వరకు యూడైస్‌ ప్లస్‌ 2024–25 విద్యాసంవత్సరం నమోదు ప్రక్రియ ముగియనుంది.

ఇంతకు మునుపు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమాచారం నిక్షిప్తమై ఉండేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, సదుపాయాల వివరాలన్నీ నమోదు చేస్తున్నారు.

చదవండి: Department of Education: క్లాస్‌ రూమ్‌కు సెల్‌ తీసుకెళ్లొద్దు.. సెల్‌ఫోన్‌ వాడితే చర్యలు

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు, 40 పైచిలుకు ఇంటర్మీడియ ట్‌ కళాశాలలు, ప్రైవేటు బడులు, కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వసతు ల వివరాలను యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో నమోదు చే యాలని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆ దేశాలు ఇచ్చింది.

దీని ప్రకారం ఈ పోర్టల్‌కు ఉపాధ్యా య, పాఠశాలల వివరాలను అనుసంధానం చే స్తున్నారు. ఒక్కో విద్యార్థి ఆధార్‌ సంఖ్య, పుట్టిన తే దీ, తరగతి వివరాలు పొందుపర్చుతున్నారు. గత 20 21–22 సంవత్సరం వరకు యూడైస్‌ వివరా ల ను నమోదు చేయగా, గతేడాది నుంచి మాత్రం యూడైస్‌ ప్లస్‌ అనే పోర్టల్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందులో నమోదు చేసిన, చేయాల్సిన వివరాలను మూడు విభాగాలుగా విభజించి నిక్షిప్తం చేస్తున్నారు.

చదవండి: School Students : ఈ టీచ‌ర్ మాకొద్దంటూ విద్యార్థుల ఆందోళ‌న‌..

ఏమేం ఉన్నాయి..?

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో యూడైస్‌ ప్లస్‌ లో వివరాలు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 1 నుంచి ఇంటర్‌ వరకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థుల వివరాలను పొందుపరుస్తున్నారు.

ఈ గణాంకాల ఆధారంగానే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వాలు బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల విడుదలకు అవకాశం ఉంది. పాఠశాలల్లో తరగతి గదులు ఎన్ని ఉన్నాయి, విద్యార్థుల సంఖ్య, మరుగుదొడ్లు, ఆటస్థలాలు, వంటగదులు, తాగునీటి వసతి తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతీ విద్యార్థికి శాశ్వత విద్య క్రమసంఖ్య(పీఈఎన్‌, పర్మినెంటు ఎడ్యుకేషన్‌ నంబరు) కేటాయించనున్నారు. దీంతో ఏయే తరగతుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.

యూడైస్‌లో నమోదు చేసిన వివరాలను అత్యంత గోప్యంగా, ప్రామాణికంగా నిర్వహించడానికి వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా తమ పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, వివరాల నమోదుపై నిర్మల్‌ డీఈవో డాక్టర్‌ ఏ.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల సమగ్ర వివరాల ద్వారా పారదర్శకత పెరుగుతుందని, వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించేలా ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో..

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నమోదులో వెనుకబడినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు 1090 ఉన్నాయి. ఇందులో 1,21,305 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటివరకు 1090 పాఠశాలల్లో 797 పాఠశాలల సమగ్ర వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా 293 పాఠశాలల న మోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

జిల్లా వ్యాప్తంగా 221 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 58, 033 మంది చదువుతున్నట్లు ఇదివరకు లెక్కలు న్నాయి. యాజమాన్యాలు డేటా పొందుపర్చడంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి. అపార్టుమెంటులో పాఠశాలలు కొనసాగిస్తుండడం, ఆటస్థలాలు లేకపోవడం వల్ల జాప్యం చేస్తున్నాయి.

అర్హతలేని టీచర్లతో బోధన, తక్కువ వేతనాలు చెల్లిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీచర్లకు వేతనా లు అందక, తక్కువగా ఉన్నాయని మానేయడం యాజమాన్యాలకు కలిసి వస్తున్నాయి. దీంతో టీచ ర్ల కాకి లెక్కలతో డేటా నమోదు చేస్తూ తప్పించుకుంటున్నాయి. టీచర్లు ఎప్పుడు మానేస్తారో తెలి యదని.. వివరాలు ఎలా నమోదు చేయాలో తెలి యకుండా పోతోందని ప్రైవేటు యాజమాన్యాలు వాపోతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పాఠశాలల వివరాలు

జిల్లా

ప్రభుత్వ

ప్రైవేటు

నిర్మల్‌

842

192

ఆదిలాబాద్‌

1,279

151

మంచిర్యాల

869

221

కుమురంభీం

1,148

102

Published date : 19 Sep 2024 03:15PM

Photo Stories