Science Fair: రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌కు శిశుమందిర్ విద్యార్థులు
Sakshi Education
నిర్మల్ చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ శ్రీ సరస్వతీ శిశుమందిర్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు నరేశ్ తెలిపారు.
ఇటీవల ఆదిలాబాద్ విభాగ్‌లో జరిగిన గణిత విజ్ఞానమేళా, సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. శిశువర్గ సంస్కృతి జ్ఞానక్విజ్‌లో పతాని రాజశ్రీ, బైరి జ్ఞాపిక, లావణ్య ప్రథమస్థానం, పీపీటీ పత్ర సమర్పణలో ప్రశాంత్‌రాజ్ ద్వితీ య స్థానం, బాలవర్గలో పీపీటీపత్ర సమర్పణలో సాయి ప్రథమస్థానం, మట్టితో విగ్రహాల తయారీలో వినయ్ ప్రథమ స్థానం, కిశోర వర్గలో సంస్కృతి జ్ఞాన క్విజ్‌లో విద్య, శశింద్ర, ప్రసన్న ప్రథమ స్థానం సాధించారు. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సైన్స్‌ఫేర్‌లో పాల్గొంటారన్నారు.
చదవండి: Indian Naval Academy : ఇండియన్ నేవల్ అకాడమీలో ఎస్‌ఎస్‌సీ పోస్టులు.. దరఖాస్తులకు వీరే అర్హులు..
Published date : 27 Sep 2024 10:26AM