Skip to main content

Ministry of Public Health: భారతీయ వైద్య విద్యార్థుల కోసం ఉజ్బెకిస్థాన్‌ హెల్ప్‌లైన్‌

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ, తాష్కెంట్‌ మెడికల్‌ అకాడమీ (టీఎంఏ) కలిసి భారతీయ ఎంబీబీఎస్‌ విద్యార్థుల కోసం జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రమాణాల ప్రకారం 18001232931 అనే టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్, www.studyinuzbek.uzడ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి.
Ministry of Public Health
భారతీయ వైద్య విద్యార్థుల కోసం ఉజ్బెకిస్థాన్‌ హెల్ప్‌లైన్‌

 హైదరాబాద్‌లోని టీఎంఏ దక్షిణాసియా ప్రతినిధి కార్యాలయం దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో సెమినార్లు కూడా నిర్వహిస్తున్నాయి. కొంతమంది మోసపూరిత ఏజెంట్లు ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు కల్పిస్తామ­ని చెబుతూ, మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఎన్‌ఎంసీ తాజాగా కొత్త నిబంధనలు విధించింది. ఈ వెబ్‌సైట్, హెల్ప్‌లైన్‌ ద్వారా వైద్య విద్యార్థులు విదేశీ విద్య విషయంలో సమాచారాన్ని తనిఖీ చేసుకుని, తమ ప్రవేశాల విషయాన్ని ఎన్‌ఎంసీ ప్రమాణాల ప్రకారం ఖరారు చేసుకోవచ్చు.

చదవండి: Government Medical Association: ‘వైద్యుల సమస్యలు పరిష్కరించాలి’

టీఎంఏ వైస్‌ డీన్‌ ఖొల్మతొవ్‌ మాట్లాడుతూ ‘మా వ్యూహాత్మక భాగస్వామి నియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ భారతీయ పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు, అధ్యాపకులు, నెక్ట్స్‌ మాస్టర్‌ క్లాసులను అందిస్తుంది. 250 మంది భారతీయ విద్యార్థులను టీఎంఏలో ఇంగ్లిష్‌ మీడియంలో ఆరేళ్ల పాటు వైద్య విద్యను చదవడానికి వీలు కల్పిస్తుంది’ అని అన్నారు.

చదవండి: Children's health: చిన్నారుల ఆరోగ్యమే ప్రధానం

Published date : 21 Aug 2023 01:54PM

Photo Stories