CEC Sushil Chandra: ఏ దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత సీఈసీ పరిశీలకునిగా వ్యవహరించారు?
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర ఉజ్బెకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ పరిశీలకునిగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ఆ దేశంలో పర్యటించిందని అక్టోబర్ 28న భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. కొత్త ఎన్నికల కోడ్‌ను అనుసరించి అక్టోబర్ 24న ఉజ్బెకిస్తాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుశీల్ చంద్ర సీఈసీగా 2021, ఏప్రిల్ 13న బాధ్యతలు చేపట్టారు. 2022, మే 14వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు?
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. అక్టోబర్ 28న వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు.
చదవండి: భారత్ – ఆసియాన్ ఫ్రెండ్‌షిప్ ఇయర్‌ను ఎప్పడు పాటించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉజ్బెకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ పరిశీలకునిగా వ్యవహరించిన వ్యక్తి?
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర
ఎక్కడ : ఉజ్బెకిస్తాన్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్