రాయదుర్గం: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 2023–24 అకడమిక్ సెషన్ కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ)–2023 ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోందని ‘మనూ’ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.ఎం.వనజ మార్చి 6న తెలిపారు.
‘మనూ’లో సీయూఈటీ ద్వారా యూజీ ప్రవేశాలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దర ఖాస్తులను సమర్పించడానికి మార్చి 12 వరకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ‘మనూ’ రెగ్యులర్ పీజీ బీటెక్, బీఈడీ, డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్, డీఈఐ. ఈడీ అన్ని సర్టిఫికెట్, పరిశోధన ప్రోగ్రా మ్‌ల ప్రవేశాలను విడిగా తెలియజేస్తుందన్నారు.