Skip to main content

PG Admissions: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

పంజగుట్ట: కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం లో 2025- 26 సంవత్సరానికి వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. లింగమూర్తి తెలిపారు.
Invitation of Applications for PG Courses  Central University of Karnataka invites PG applications 2025-26

సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జ‌న‌వ‌రి 19న‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్ సురేష్, డాక్టర్ వి.గోవింద్ కలిసి ఆయన మాట్లాడారు. కేవలం హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థు లకు ఎంతో సమీపంలో ఇక్కడి వాతావరణంలోనే తమ 654 ఎకరాల సువిశాలమైన యూనివర్సిటీ ఉందని వారు పేర్కొన్నారు.

చదవండి: Osmania University: ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష వాయిదా

అడ్మిషన్ల కోసం దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఫిబ్ర‌వ‌రి 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు ఎంట్రెన్స్ పరీక్షలు మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: Spot Admissions: పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్స్‌.. చివరి తేదీ ఇదే

కోర్సు పూర్తికా గానే 100 శాతం ప్లేస్మెంట్ విద్యార్థులు బయటకు వెళ్తారని తెలిపారు. త్వరలోనే గ్రాడ్యు యేట్ కోర్సులకు, పీహెచ్డీకి దరఖాస్తులు తీసు కుంటామన్నారు. విద్యార్థులకు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం, పీహెచ్డీ చేసేందుకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 21 Jan 2025 01:46PM

Photo Stories