Teachers Transfers: టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
యూనియన్ నాయకులకు 10 పాయింట్ల కేటాయింపును న్యాయస్థానం తప్పుబట్టడంతో పాటు స్పెషల్ పాయింట్లను నిలిపివేసింది. అయితే ఉపాధ్యాయ దంపతులకు అదనపు పది పాయింట్లు కేటాయించేందుకు అనుమతినిచ్చింది. బదిలీలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలి సిందే. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: Teachers Awards 2023: వచ్చేనెల 1న ఆంగ్లమాద్యమ టీచర్లకు అవార్డుల పరీక్ష
విద్యాశాఖాధికారులు టీచర్లకు సంబంధించిన హార్డ్ కాపీలను సేకరించారు. వెబ్ ఆప్షన్ సమయంలో ఇతర జిల్లాలకు చెందిన కొంత మంది బదిలీల్లో ఉన్న పలు అంశాలపై కోర్టుకెళ్లడంతో అప్ప ట్లో ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బుధవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో బదిలీ, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న టీచర్లలో హర్షం వ్యక్తమవుతుంది.
త్వరలో షెడ్యూల్ విడుదలకు అవకాశం
హైకోర్టు నుంచి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రభుత్వం త్వరలో బదిలీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బదిలీల కోసం ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 1,097 పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రధానోపాధ్యాయ పోస్టులు 44 ఉన్నా యి. 24 మంది హెచ్‌ఎంలు ఒకే పాఠశాలలో ఐదేళ్ల పాటు పనిచేయడంతో వీరికి తప్పనిసరిగా బదిలీ జరగనుంది. ప్రధానోపాధ్యాయులకు సంబంధించి బది లీల్లో మొత్తం 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: Teachers: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు
అలాగే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు సంబంధించి 1029 ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇదివరకు 502 పోస్టులు ఖాళీ ఉండగా, ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు జిల్లాలో 527 మంది టీచర్లు ఉన్నారు. జిల్లాలో బదిలీల కోసం 1,605 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు. వీరిలో పీజీ హెచ్‌ఎంలు 41 మంది, పీఎస్ హెచ్‌ఎంలు 19, ఎస్జీటీలు 857 మంది, స్కూల్ అసిస్టెంట్‌లు 488 మంది, లాంగ్వేజ్ పండితులు 119, పీఈటీలు 49, ఇతరులు ఐదుగురు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.