సాక్షి, అమరావతి: డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఎడ్యునెట్ ఫౌండేషన్, ఏపీనైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
నైపుణ్య శిక్షణకు త్రైపాక్షిక ఒప్పందం
తాడేపల్లిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సత్యనారాయణ, ఎడ్యునెట్ ఫౌండేషన్ డైరెక్టర్ ఆశిష్ అరోరా సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.