APSSDC: దాల్మియా భారత్ ఫౌండేషన్‌తో ఏపీఎస్ ఎస్‌డీసీ ఒప్పందం
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి దాల్మియా భారత్ ఫౌండేషన్ ముందుకువచ్చింది.
వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, ఐటీఈఎస్, హెల్త్‌కేర్ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దాల్మియా భారత్ ఫౌండేషన్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
చదవండి: APSSDC: ‘నైపుణ్యం’లో ముందడుగు.. స్కిల్ కాలేజీలు ఏర్పాటు..
నవంబర్ 23న ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దాల్మియా భారత్ గ్రూప్ సీఎస్‌ఆర్ కంట్రీ హెడ్ డా.అరవింద్ మధుకర్ బోధన్‌కర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సత్యనారాయణ ఒప్పందపత్రాలను మార్చుకున్నారు.
చదవండి: APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?
Published date : 24 Nov 2022 03:40PM