Skip to main content

APSSDC: ‘నైపుణ్యం’లో ముందడుగు.. స్కిల్‌ కాలేజీలు ఏర్పాటు..

రాష్ట్రంలోని యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
APSSDC
‘నైపుణ్యం’లో ముందడుగు.. స్కిల్‌ కాలేజీలు ఏర్పాటు..

ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో స్కిల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్టోబర్‌ 31 నుంచి రెండు స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ ప్రారంభమైంది. విశాఖపట్నంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌లో మారిటైమ్‌ రంగానికి చెందిన స్కిల్‌ కాలేజీ, అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కాలేజీలో తరగతులను ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ వర్చువల్‌గా ప్రారంభించారు.

చదవండి: అడ్వాన్స్‌ డేటా సైన్స్‌ హ్యాక్‌థాన్‌ విజేతల ఎంపిక

బ్యాచ్‌కి 30 మంది విద్యార్థులు ఉండేలా మూడు కోర్సులను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తొలి బ్యాచ్‌ అక్టోబర్‌ 31 నుంచి మొదలు కాగా మరో వారం రోజుల్లో రెండు బ్యాచ్‌లు ప్రారంభమవుతాయన్నారు. విశాఖ కాలేజీలో మెకాట్రానిక్స్‌ డిజైన్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటర్, ప్రోడక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌ మెకానికల్, అటోమేషన్‌ అండ్‌ రోబోటిక్‌ ఇంజనీర్‌ కోర్సుల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో ప్రోడక్ట్‌ డిజైనింగ్, సీఎన్‌సీ టెక్నాలజీ, మెకాట్రానిక్స్‌లో మాస్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహిస్తారు. నవంబర్‌ 10న మరో రెండు స్కిల్‌ కాలేజీల్లో తరగతులను పారంభించనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. 

చదవండి: APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?

Published date : 01 Nov 2022 04:24PM

Photo Stories