Skip to main content

అడ్వాన్స్‌ డేటా సైన్స్‌ హ్యాక్‌థాన్‌ విజేతల ఎంపిక

అడ్వాన్స్‌ డేటా సైన్స్‌ విభాగంలో నిర్వహించిన హ్యాక్‌థాన్‌లో ఎంపికైన విజేతల ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చే విధంగా పూర్తిస్థాయి మద్దతు ఇవ్వనున్నట్లు Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) ప్రకటించింది.
Selection of Advance Data Science Hackathon Winners
అడ్వాన్స్‌ డేటా సైన్స్‌ హ్యాక్‌థాన్‌ విజేతల ఎంపిక

ఇండో యూరో సింక్రనైజేషన్‌ (ఐఈఎస్‌)తో కలిపి ఏపీఎస్‌ఎస్‌డీసీ అడ్వాన్స్‌ డేటా సైన్స్‌లో నిర్వహించిన హాŠయ్‌క్‌థాన్‌ విజేతలను ప్రకటించింది. 15 మంది పోటీ పడగా లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ బృందం తొలి బహుమతిని గెలుచుకుంది. ద్వితీయ బహుమతిని ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ, నూజివీడుకు చెందిన రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌అండ్‌ టెక్నాలజీ మూడో బహుమతిని దక్కించుకుంది. సెప్టెంబ‌ర్ 28న‌ ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌ రెడ్డి, చైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి, ఎండీ ఎస్‌.సత్యనారాయణ, ఐఈఎస్‌ సీఈవో రాజ్‌ వంగపండు బహుమతులను ప్రదానం చేశారు. చల్లా మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపికైన సభ్యులు దేశంలోని వివిధ ఇంక్యుబేషన్‌ సెంటర్లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. 

చదవండి: 

Data Science: హ్యాకథాన్‌ ప్రారంభం

APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?

Published date : 29 Sep 2022 03:56PM

Photo Stories