Skip to main content

Teacher Transfers: టీచర్ల బదిలీలు సాధారణ ప్రక్రియే.. మానవతా కోణంలో పరిశీల‌న‌

సాక్షి, హైదరాబాద్ః జిల్లా స్థాయి పాఠశాలల్లో విధుల సర్దు బాటు కోసమే ఒక చోటు నుంచి మరో చోటుకు టీచర్లను బదిలీ చేయడం జరిగిందనీ, ఇది సాధారణ ప్రక్రియేనని పాఠశాల విద్యాకమిషనర్‌ ఎ.దేవసేన స్పష్టం చేశారు.
Transfers of teachers are a normal process   SchoolEducationCommissioner

‘టీచర్లు సిటీకి.. చదువులు గాలికి,  తప్పు మీదంటే మీదే’ అనే శీర్షికలతో  ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తల కు ఆమె ఫిబ్ర‌వ‌రి 6న‌ వివరణ ఇచ్చారు. విద్యార్థు లు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని పాఠశ లల కు టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూల్స్‌ నుంచి ఉపాధ్యా యులను పంపినట్టు వెల్లడించారు.

చదవండి: Teacher Jobs: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు

టీచర్ల ప్రత్యేక అవసరాలను మానవతా కోణంలో పరిశీ లించిన తర్వాత వారిని ఇతర స్కూళ్ళకు పంపే విచక్షణాధి కారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.  ప్రభు త్వ ఉత్తర్వులను అమలు పరిచే విషయంలో గానీ, పాలన సంబంధమైన విషయాల్లో గానీ విద్యాశాఖ అధి కార వ్యవ స్థలో పూర్తిగా సమన్వయ, సద్భావనలు ఉన్నా యని వెల్ల డించారు. ఈ విషయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి, తనకు భిన్నాభిప్రాయాలు లేవని పునరుద్ఘాటించారు.  

చదవండి: Teachers Transfer: బదిలీలు లేకుండానే పాఠశాలల్లో కొత్త టీచర్లు.. ఇదే కారణమా..!

Published date : 07 Feb 2024 10:48AM

Photo Stories