Teacher Jobs: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు
1998 డీఎస్సీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించి.. 24 సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. నాటి ప్రభుత్వాలు వారి వేదన ఆలకించలేదు. ప్రస్తుతం వారందరికీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) విధానంలో ఉద్యోగాలు కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 533 మంది 1998 డీఎస్సీ అభ్యర్థులు టీచర్లుగా విధులు నిర్వర్తిస్త్తున్నారు.
చదవండి: Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్.. ఎవరు అర్హులంటే..
13 ఏళ్ల నిరీక్షణకు తెర
2008 డీఎస్సీలో అర్హత పొంది పలు కారణాలతో కొంత మంది ఉద్యోగాలు పొందలేకపోయారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎన్నోసార్లు ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వారికి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 468 మందికి ఒప్పంద ప్రాతిపదికన మినిమమ్ టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చారు. వారందరూ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు.