OU PhD Admissions: ఓయూ పీహెచ్‌డీ కేటగిరీ-2 ప్రవేశాలకు ప్రకటన.. వీరికి నో గైడ్‌షిప్.. గైడ్‌షిప్ అంటే?

పీహెచ్‌డీ ప్రవేశాలకోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ - 2025కు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి జనవరి 20న పేర్కొన్నారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల ఆం దోళనల ఫలితంగా ఆరేళ్ల తర్వాత కేటగిరీ-2 పీహెచ్‌డీ ప్రవేశాలకు మోక్షం లభించింది.
అధ్యాపకుల కొరత వలన పీహెచ్‌డీ కేటగిరీ-2 ప్రవేశాలను నిలిపివేశారు. పీహెచ్‌డీ పూర్తి చేయకుండా వదిలేసిన విద్యార్థులకు గత వీసీ ప్రొ.రవీందర్ వన్ టైం ఛాన్స్ (లాస్టం) ఇవ్వడంతో సుమారు 1,300 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు. దీంతో పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం లభించింది.
![]() ![]() |
![]() ![]() |
ఓయూలో 45 సబ్జెక్టులకు, పీహెచ్‌డీ కోర్సులో 656 సీట్లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షతో పాటు ఇం టర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్ చూడవచ్చు.
చదవండి: డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో BEd –ODL కోర్సులో ప్రవేశాలు
మూడేళ్ల సర్వీసున్న అధ్యాపకులకు నో గైడ్‌షిప్
యూజీసీ నూతన నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల సర్వీస్ గల అధ్యాపకులకు పీహెచ్‌డీ విద్యార్థుల గైడెపన్ను (పర్యవేక్షణ) రద్దు చేశారు. గతంలో రిటైర్మెంట్ అయిన అధ్యాపకులకు సైతం పీహెచీ గైడ్‌షిప్ ఇచ్చారు. కొత్త నిబంధనల కారణంగా పీహెచ్‌డీ సీట్లు తగ్గనున్నాయి.
గైడ్‌షిప్ అంటే!
- గైడ్‌షిప్ అంటే పరిశోధనకు సంబంధించిన సహాయం.
- పరిశోధన కోసం అర్హులైన విద్యార్థులకు గైడ్‌షిప్ అందిస్తారు.
- పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యార్థులకు గైడ్‌షిప్ అందిస్తారు.
- ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లు తమ విద్యార్థులకు గైడ్‌షిప్ అందిస్తారు. ముఖ్యంగా పీజీ లేదా పీహెచ్‌డీ చేయబడుతున్న విద్యార్థులకు తగిన దిశానిర్దేశం ఇవ్వడం.
Tags
- Ph.D Admission Notification under Category-II
- PhD Research
- UG PG Ph.D. Admission Notification
- Osmania University releases schedule for PhD Entrance Test
- Osmania University PhD Admission 2025
- OU PhD Admission Dates 2025 Out
- Osmania University PhD notification
- Osmania University PhD stipend
- Osmania University PhD fee Structure
- Telangana News
- Doctor of Philosophy
- Osmania University 2025 PhD Entrance Test
- OU PhD Entrance Test 2025