Japanese Language: జపనీస్ లాంగ్వేజ్‌పై శిక్షణ
జపాన్ కు చెందిన కేసీసీఎస్ జపనీస్ స్కూల్ సీనియర్ అడ్వైజర్ హ్యోడ్, కేసీసీఎస్ ఫౌండర్ కె.కరుణానిధిలు ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, ఎండీ ఎన్.బంగార్రాజులతో నవంబర్ 9న సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జపాన్ లో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన యువత కొరత తీవ్రంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 3 లక్షల మంది నైపుణ్యం కలిగిన యువత జపాన్ లో అవసరం అవుతారన్నారు. అదే సమయంలో జపాన్ కు వచ్చేవారికి కచ్చితంగా జపనీస్ భాష వచ్చి ఉండాలన్నారు. ఇందుకోసం కనీసం 500 మంది జపాన్ భాష నేర్చుకునేందుకు ముందుకు వస్తే, పరీక్ష కేంద్రానికి అనుమతి లభిస్తుందని వారు పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఎండీ బంగార్రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జపాన్ ప్రతినిధులకు వివరించారు.
చదవండి:
కారుణ్య నియామకాలకి ఉత్తర్వులు జారీ