Skip to main content

Free Training Classes: డిగ్రీ విద్యార్థులకు శిక్షణ తరగతులు

పుట్టపర్తి టౌన్‌: డిగ్రీ విద్యార్థులు తమ చదువు పూర్తవగానే ఉద్యోగ అవకాశాలు పొందేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 9 రకాల షార్ట్‌ టర్మ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ ఖయ్యూం తెలిపారు.
State Skill Development Organization offering free training    Training classes for degree students   Job opportunities after completing studies

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌, అమెజాన్‌వెబ్‌ సర్వీస్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ట్యాలీ, హార్డ్‌వేర్‌, పైతాన్‌ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు.

చదవండి: Degree Graduates: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ

ప్రస్తుతం జిల్లాలో ఈ నెల 5 నుంచి 13 ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించామని, 1000 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Published date : 14 Feb 2024 03:12PM

Photo Stories