NIRF Top 10 Rankings 2023 : దేశంలో టాప్-10 విద్యాసంస్థలు ఇవే.. ఈ సారి కూడా..
ఈ క్రమంలో 2023 సంవత్సరానికి గాను వివిధ యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. అలాగే దేశంలో ఉత్తమ విద్యాసంస్థలను కూడా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు, మొత్తం ర్యాంకింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్, లా, ఆర్కిటెక్చర్, దంత వైద్య కళాశాలలు, కొత్త విభాగం "వ్యవసాయం, అనుబంధ రంగాలు" కలిపింది. అదనంగా, ఆర్కిటెక్చర్ డిసిప్లిన్ కేటగిరీ జాబితాలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిసిప్లిన్‌గా పేరు మార్చబడింది.
అయిదోసారి అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF) కింద మొత్తం ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ వరుసగా అయిదోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, ఐఐటీ-ఢిల్లీ నిలిచాయి. టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలి పది స్థానాలో నిలిచాయి.
ఉత్తమ యూనివర్సిటీగా..
అదే విధంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్ఎసీ ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం 4, 5 స్థానాల్లో ఉన్నాయి. బెస్ట్ యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ( HCU) పదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ఇవే..
ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానాన్ని ఐఐటీ (మద్రాస్) కైవసం చేసుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. 8వ స్థానంలో ఐఐటీ (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటీ (వరంగల్) నిలిచాయి. కాగా ర్యాంకింగ్ కోసం గతేడాది 7,254 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 8,686 దరఖాస్తులు వచ్చాయి. .
మేనేజ్‌మెంట్ విభాగంలో..
మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఫార్మసీ విభాగంలో..
ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్‌దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
టాప్-10 కాలేజీలు ఇవే..
టాప్-10 లా కాలేజీలు ఇవే..(Top 10 Law Colleges In India 2023) :
1. National Law School of India University, Bengaluru
2. National Law University, New Delhi
3. Nalsar University of Law, Hyderabad
4. The West Bengal National University of Juridical Sciences, Kolkata
5. Jamia Millia Islamia, New Delhi
6. Symbiosis Law School, Pune
7. Gujarat National Law University, Gandhinagar
8. Siksha O Anushandhan, Bhubaneswar
9. Indian Institute of Technology, Kharagpur
10. Babasaheb Bhimrao Ambedkar University, Lucknow