Telugu University: తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం.. పురస్కార గ్రహీతలు వీరే...
మార్చి 21న వర్సిటీ ఆడిటోరియంలో వీసీ ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి డైరెక్టర్ డాక్టర్ మంగారి రాజేందర్(జింబో) ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.5,116 నగదు, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
అనంతరం మంగారి రాజేందర్ మాట్లాడుతూ... కళలు, సాహిత్యం మనిషి జీవితంతో నిరంతరం ముడిపడి ఉంటుందని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.వీసీ తంగెడ కిషన్‌రావు పురస్కార గ్రహీతలను సభకు పరిచయం చేస్తూ వారు సమాజానికి చేస్తున్న సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా వర్సిటీ జానపద కళల శాఖాధిపతి డాక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
చదవండి: History Researcher: చరిత్ర పరిశోధకునికి తెలుగు విశ్వవిద్యాలయం అందించిన పురస్కారం
పురస్కార గ్రహీతలు వీరే...
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(సాహిత్య విమర్శ), కొల్లాపురం విమల(మహిళాభ్యుదయం), కొడాలి వెంకటేశ్వరరావు(లలిత సంగీతం), ప్రసన్నకుమారి(శాసీ్త్రయ సంగీతం), ఎస్.కె.బాబూజి(జానపద కళలు), రంగరాజు పద్మజ(ఉత్తమ రచయిత్రి), నామని సుజాతాదేవి(ఉత్తమ రచయిత్రి), డాక్టర్ కె.శ్రీదేవి(నవల), లలితారాజ్(ఉత్తమ నటి), మోహన్ సేనాపతి(ఉత్తమ నటుడు), గరికపాటి కాళిదాస్(నాటకరంగంలో కృషి), డాక్టర్ ఆర్.ఎల్.వి.రమేష్((ఆంధ్రనాట్యం), డాక్టర్ ఎస్.పి.భారతి(కూచిపూడి నృత్యం), జి.వి.ఎన్.రాజు (వ్యక్తిత్వ వికాసం), షరీఫ్ గోరా( హేతువాద ప్రచారంలో కృషి), డాక్టర్ చేగొని రవికుమార్(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), అనుముల శ్రీనివాస్(గ్రంథాలయకర్త), మాదిశెట్టి గోపాల్(సాంస్కృతిక సంస్థ నిర్వాహణ), బి.వి.సత్య నగేష్(ఇంద్రజాలం), మృత్యుంజయ(కార్టూనిస్ట్), డాక్టర్ నూనె వెంకటయ్య (జ్యోతిషం), సి.రామనాధ శర్మ(ఉత్తమ ప్రధానోపాధ్యాయులు), గౌరవి వేమలు (చిత్రలేఖనం)