Telangana School Holidays : విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..? కారణం ఇదేనా..?
వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 10వ తేదీ (శుక్రవారం) ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 13వ తేదీ (సోమవారం) నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా..
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 13 నుంచి స్కూళ్లు పున:ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. అలాగే పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని, విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సారైన తెలంగాణలో పాఠశాలలు టైమ్‌కి తెరుచుకుంటాయా.. లేదా అనేది సందిగ్దంలో ఉన్నాయి.
జూన్ 12వ క్లారిటీ..?
అయితే, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యశాఖ నివేదిక ఇవ‍్వడం, హెచ్చరించడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై జూన్ 12వ తేదీ (ఆదివారం) సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.