వ్యవసాయ విద్య బలోపేతానికి సర్వే
వ్యవసాయేతర కోర్సులైన బీఈ, బీటెక్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారి అనుభవాలు, వారి ఆదాయం, ఇతర అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. నేషనల్ అగ్రికల్చరల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ (ఎన్‌ఏహెచ్‌ఈపీ)లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇన్‌కమ్ ఇండెక్స్ (జీఐఐ) కింద ఈ సర్వేను ప్రారంభించింది. దేశంలో వ్యవసాయ విద్యను మరింత ప్రయోజనకరంగా బలోపేతం చేసి తీర్చిదిద్దేందుకు ఈ సర్వేలోని అంశాలు తోడ్పడతాయని ఐసీఏఆర్ అభిప్రాయపడుతోంది. ప్రపంచ బ్యాంక్ ఆరి్థక సాయంతో ఈ ప్రాజెక్ట్‌ను ఐసీఏఆర్ చేపట్టింది.
చదవండి: ICAR Recruitment 2023: ఐకార్-ఐఏఎస్‌ఆర్‌ఐ, న్యూఢిల్లీలో ఐటీ ప్రొఫెషనల్ పోస్టులు
యూజీసీ అనుమతి పొందిన విశ్వవిద్యాలయాలు, కాలేజీల పూర్వ విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థలు ఆయా పూర్వ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి ఉంటే తమకు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడుతోంది. యూజీసీ ఆమోదించిన బీటెక్ వంటి నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు అందిస్తున్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ పూర్వ విద్యార్థులందరినీ ఈ సర్వేలో పాల్గొనేలా సహకారం అందించాలని ఐసీఏఆర్ కోరింది. అగ్రికల్చర్, అనుబంధ నేపథ్య కోర్సులు మినహా బీఈ, బీఫార్మా, హెచ్‌ఎంసీటీ తదితర కోర్సులు చేసిన పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను ఈ సర్వే ద్వారా సేకరించనున్నారు.
చదవండి: Success Story : లక్ష జీతం వదులుకున్నా.. జామకాయలు అమ్ముతున్నా.. కారణం ఇదే..
ఈ నెల 15లోగా అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు అందేలా చూడాలని యూజీసీ ఆయా వర్సిటీలు, కాలేజీలకు సూచించింది. ఇందుకు సంబంధించి 30 ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్ సర్వే లింకును కూడా ఐసీఏఆర్ అందుబాటులో ఉంచింది. డిగ్రీలు పూర్తి చేసి ఒక ఏడాదిపాటు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారంతా వారి అభిప్రాయాలు తెలపాలని కోరింది. యూజీసీ వెబ్‌సైట్‌లోనూ ఇందుకు సంబంధించిన వెబ్‌లింక్‌ను పొందుపరిచింది.