Skip to main content

Global Agri Award: రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్‌

సాక్షి, అమరావతి: నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బల్యాన్, నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్‌ ప్రశంసించారు.
Global Agri Award for AP Seeds 2022
Global Agri Award for AP Seeds 2022

విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఐసీఎఫ్‌ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్‌ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్‌ అగ్రి అవార్డును అందించింది. 

Also read: YSR Awards 2022 : విజయవాడలో ఘనంగా పురస్కారాల ప్రదానోత్సవం

నవంబర్ 9న జరిగిన ఇండియా అగ్రి బిజినెస్‌ సమ్మిట్‌లో ఈ అవార్డును సంజీవ్‌కుమార్‌ బల్యాన్, రమేష్ చంద్‌ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు.  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Nov 2022 03:42PM

Photo Stories