Skip to main content

UNOలో ప్రసంగానికి ఎంపిక

అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం
డి అభయ్‌ చరణ్‌,శివ లింగమ్మ
డి అభయ్‌ చరణ్‌,శివ లింగమ్మ

కర్నూలు సిటీ: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం దక్కనుంది. ఇందుకు ప్రస్తుతం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన 20 మందిని ఎంపిక చేశారు. వీరికి నేడు(బుధవారం) స్పీకింగ్‌ టెస్ట్‌ను వెబెక్స్‌ ద్వారా నిర్వహించనున్నారు.

Also read: Medical college: ఆగస్టు 15లోగా వైద్య కళాశాల తుది దశ పనులు పూర్తి

స్పీకింగ్‌ పరీక్షకు ఎంపికై న వారిలో జిల్లా నుంచి ఆదోని డివిజన్‌ పరిధిలోని సంతకొడ్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన డి.అభయ్‌ చరణ్‌ (ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ నూజివీడులో అడ్మిషన్‌ పొందారు), ఆదోని కస్తూరిబా గాంధీ విద్యాలయ(మైనార్టీ)లో 10వ తరగతి చదివిన ఎం.శివ లింగమ్మ (ప్రస్తుతం ఆరెకల్లు రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో చేరారు) ఉన్నారు. వీరు నేడు ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌లో వెబెక్స్‌ ద్వారా జరిగే పరీక్షలో పాల్గొననున్నారు. ఇందులో ఎంపికై న వారికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అధికార నివాసం వైట్‌హౌస్‌ను సందర్శించే అవకాశం దక్కనుంది. అదే సమయంలో కొలంబియా వర్సిటీలో నిర్వహించనున్న సదస్సులో ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రపంచ బ్యాంకు నిర్వహించే సదస్సులో కూడా మాట్లాడే అవకాశం దక్కుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైట్‌హౌస్‌ సందర్శన అవకాశాన్ని అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ అసియా అఫైర్స్‌ విభాగం కల్పిస్తుంది.

Also read: Sakshi Spell Bee 2023 Category - 3 | English spelling contest in TS || #SakshiEducation

ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌లో
వెబెక్స్‌ ద్వారా పరీక్ష

  • డి అభయ్‌ చరణ్‌,శివ లింగమ్మ

    డి అభయ్‌ చరణ్‌,శివ లింగమ్మ

    డి అభయ్‌ చరణ్‌,శివ లింగమ్మ

Published date : 02 Aug 2023 03:09PM

Photo Stories